Sridhar Babu | ఎల్‌నినో ముప్పు.. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sridhar Babu | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. కరీంనగర్ ( Karimnagar )కలెక్టరేట్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి ఆయన ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

Sridhar Babu | ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక..

ఎల్‌నినో వల్ల ఉత్పన్నమయ్యే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, తాగునీరు, వైద్యం, విద్యుత్ , విపత్తు నిర్వహణ శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే రైతులు నష్టపోకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

Sridhar Babu | సాగునీటి ప్రాజెక్టులు ..

సాగునీటి తరలింపు అంశంపై స్పష్టతనిస్తూ, మేడిగడ్డ , కన్నెపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో తమకు ఎటువంటి రాజకీయ భేషజాలు లేవని మంత్రులు స్పష్టం చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నిబంధనలకు అనుగుణంగా, వారు అనుమతించిన పక్షంలోనే నీటిని తరలిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరిలో 16వేల క్యూసెక్కుల వరద కూడా లేదని, ఈ పరిస్థితుల్లో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమని ఆయన కొట్టిపారేశారు.

Sridhar Babu |ఉద్యోగాల కల్పనపై వివరణ..

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల నియామకాలు నిలిచిపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.  ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశామని, ఇప్పటివరకు 56వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి:  Armoor Political Heat | కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ సవాళ్లతో ఆర్మూర్​లో పొలిటికల్​ హీట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *