అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagaland Landslide | నాగాలాండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.
మోన్ జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడి పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. కొండచరియ విరిగిపడిన తర్వాత ఆ ప్రాంతంలోకి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని పోలీసులు తెలిపారు.
Nagaland Landslide | మృతులకు రూ.4 లక్షల పరిహారం
ఈ ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోన్ జిల్లాతో పాటు, మోకోక్‌చుంగ్ జిల్లాలోని తూలిలో తీవ్ర నష్టం వాటిల్లింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 74,000 తక్షణ ఎక్స్-గ్రేషియా సహాయాన్ని ముఖ్యమంత్రి నైఫియు రియో ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రజలు సైతం ప్రమాదకరమైన వాలు ప్రాంతాలు, నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.
MON LANDSLIDE: CLOSER VIEW REVEALS SCALE OF DEVASTATION IN DEFENCE COLONY
📍 MON, NAGALAND | 19 July 2026
New close-up visuals from Defence Colony, Mon Town reveal the devastating impact of the rain-triggered landslide, with collapsed homes, massive earth movement, and… https://t.co/tvVlM7KSAg pic.twitter.com/HGicCHQX80
— SpeakNaga_X (@SpeakNaga_X) July 19, 2026
దీనిని కూడా చదవండి : Trainee IPS Harassment | ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు