England vs India ODI | లార్డ్స్​లో ఇంగ్లండ్​ విజయం.. పోరాడి ఓడిన భారత్​..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: England vs India ODI | లార్డ్స్​ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్​లో ఇంగ్లండ్​ జట్టు ఘన విజయం సాధించి, సీరిస్​ను కైవసం చేసుకుంది. గెలుపు కోసం భారత జట్టు చివరి వరకు పోరాడి ఓడింది.

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా భారత్ టీ 20 సిరీస్​ను కోల్పోయింది. అనంతరం తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు, రెండో వన్డేలో ఓడిపోయింది. ఇప్పుడు కీలకమైన మూడో మ్యాచ్​లోనూ ఓడిపోయింది.

నిర్ణీత 50 ఓవర్లలో భారత ఆటగాళ్లు 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్​ జట్టు విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్​ ఆటగాళ్లు రెచ్చిపోయారు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇంగ్లిష్​ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది.

England vs India ODI | రెచ్చిపోయిన ఓపెనర్లు

ఇంగ్లండ్​ ఓపెనర్​ బెన్ డకెట్ (Ben Ducket) సెంచరీతో చెలరేగాడు. 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. జాకోబ్​ బెతెల్​ (91) తృటిలో సెంచరీ కోల్పోయాడు.

England vs India ODI | ఇంగ్లాండ్​ భారీ స్కోర్​.. భారత్​ లక్ష్యం 388 పరుగులు

England vs India ODI | రోహిత్​ అద్భుత సెంచరీ వృథా

తదుపరి 388 పరుగుల భారీ లక్ష్యంతో భారత జట్టు రంగంలోకి దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో కదం తొక్కాడు. తన క్లాసిక్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ, కేవలం 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో భారీ ఛేదనలో భారత్‌ను పటిష్ఠ స్థితిలో నిలబెట్టాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 34వ శతకం.

ఇక రోహిత్​ శర్మ ఔట్​ కావడంతో జట్టు బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. 60 బాల్స్​ ఆడి 74 పరుగులు చేసి క్యాచ్​ ఔట్​ అయ్యారు. మైదానంలో రోహిత్​ శర్మ – విరాట్​ కోహ్లీ ఉన్నంత సమయం కూడా ఆట భారత జట్టు వైపు ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే వీరిద్దరు కూడా మైదానం నుంచి వెళ్లిపోయారో.. ఆట ఇంగ్లండ్​ జట్టు చేతుల్లోకి వెళ్లిపోయింది.

England vs India ODI

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *