అక్షరటుడే వెబ్‌డెస్క్: Sonam Wangchuk | నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ , దేశ విద్యావ్యవస్థలోని లోపాలపై గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, తాను దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రభుత్వం , రాజకీయ పార్టీలు తమ మూడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తన చేతిరాతతో రాసిన లేఖను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన విడుదల చేశారు.
Sonam Wangchuk | మూడు డిమాండ్లు..
దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలకు, ముఖ్యంగా ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీకేజీలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా లేవనెత్తుతామని రాజకీయ నాయకులు బహిరంగ హామీ ఇవ్వాలి. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు స్వయంగా ఆసుపత్రికి వచ్చి, పైన పేర్కొన్న షరతులపై తనకు భరోసా ఇవ్వాలి.
Sonam Wangchuk | జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత..
సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఢిల్లీలో ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప లాఠీచార్జ్ జరిగింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అధికారులు జేఎన్‌యూ, మెట్రో స్టేషన్లు సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
WHEN WILL I END THE FAST….!
Not withstanding my health my fast continues till after the Sansad Chalo March, and will be broken only under the following circumstances… pic.twitter.com/kaOGx2Nk4T— Sonam Wangchuk (@Wangchuk66) July 20, 2026
ఇది కూడా చదవండి: Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్‌రావు