అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gujarat Heavy Rains |గుజరాత్ (Gujarat)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వల్సాద్ జిల్లాలోని ఉంబర్‌గావ్ తాలూకాలో 36 గంటల వ్యవధిలో 1,200 మి.మీ వర్షపాతం నమోదు అయింది. వర్షాలకు నవసారి, వల్సాద్ జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సూరత్, అహ్మదాబాద్, ఖేడా, తాపి, డాంగ్స్ జిల్లాల్లోనూ బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాలతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వల్సాద్‌లో సుమారు 1,200 మందిని వరదలో చిక్కుకుపోగా. అధికారులు రక్షించారు. నవసారి జిల్లాలోనూ 22 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో వరద వీడలేదు. అనేక గ్రామాలు, కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సైన్యానికి చెందిన రెండు బృందాలను కూడా రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.
Gujarat Heavy Rains | విద్యాసంస్థలకు సెలవు..
వల్సాద్ జిల్లాలోని ఉంబర్‌గావ్ తాలుకాలో.. బుధవారం ఉదయం 6 గంటల నుండి గురువారం సాయంత్రం 6 గంటల వరకు రికార్డు స్థాయిలో 1,200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో అతలాకుతలం అయిన జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. వర్షాలపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. అహ్మదాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో అనేక ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది.
Gujarat Heavy Rains | రెడ్ అలెర్ట్…
భరూచ్, సూరత్, నవసారి, వల్సాద్, డాంగ్స్, నర్మదా, వడోదర, ఛోటా ఉదయ్‌పూర్, పంచమహల్, దాహోద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, గాంధీనగర్, సబర్కాంథ, భరూచ్, ఆనంద్, ఖేడా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో 35కి పైగా విద్యుత్ సబ్స్టేషన్లు పనిచేయకపోవడంతో దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు, వదరలపై ముఖ్యమంత్రి స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Opposition Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాల ఆందోళన