అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft | పోలీసులు నిఘా పెడుతున్నప్పటికి చోరీలు ఆగడం లేదు. దొంగలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
Kamareddy Theft | దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో..
తాజాగా దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో ఓ విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal)లో ఏఈగా పనిచేస్తున్న గంగాధర్ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం సదరు ఉద్యోగి కుటుంబంతో కలిసి గంభీరావుపేటలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని బీరువాలో ఉంచిన 3 తులాల బంగారు గొలుసు, 20 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: PCC Chief Visit | ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్ ప్రత్యక పూజలు