LIC HFL Jobs | ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ లో ఉద్యోగావకాశాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LIC HFL Jobs | ఫైనాన్స్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకుంటున్నవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలు సంస్థలో పరిపాలన పనులు, సపోర్ట్ పనులకు సంబంధించినవి. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.

పోస్ట్ : జూనియర్ అసిస్టెంట్.

LIC HFL Jobs | భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 180.

తెలంగాణ (Telangana)లో 24 ఖాళీలున్నాయి. ఇందులో హైదరాబాద్ -సికింద్రాబాద్ పరిధిలో 19, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండలలో ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, తిరుపతిలో 1, గుంటూరులో 1 చొప్పున భర్తీ చేస్తారు.

వయో పరిమితి : 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారు(1996 ఏప్రిల్ 2 నుంచి 2005 ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారు) అర్హులు.
విద్యార్హత : కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సులు చేసినవారు అర్హులు కాదు. కంప్యూటర్ నైపుణ్యాలు తప్పనిసరి.

LIC HFL Jobs

LIC HFL Jobs | దరఖాస్తు గడువు : ఏప్రిల్ 30.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా..
దరఖాస్తు రుసుము : రూ. 800(జీఎస్టీ అదనం)
ఆన్‌లైన్ పరీక్ష జూన్ మొదటి వారంలో ఉంటుంది.
వేతనం : ఎంపికైనవారికి నెలకు రూ. 40 వేల వరకు వేతనం అందే అవకాశాలున్నాయి.
ఎంపిక విధానం :ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. చివరగా ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులు కలిపి తుది మెరిట్ లిస్ట్ తయారు చేసి, ఎంపికైనవారికి మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.lichousing.com ను విజిట్ చేయండి.

ఇది కూడా చదవండి..: SBI Jobs | రాతపరీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *