అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెబల్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన పార్టీ వార్షిక ‘అమరవీరుల దినోత్సవం’ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Mamata Banerjee | బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కూటమి పార్టీలన్నీ విభేదాలు పక్కనపెట్టి ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. తనకు ఎలాంటి అహంకారం లేదని, అందరూ కలిసి రావాలని కోరారు. నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనలకు టీఎంసీ పూర్తి మద్దతు ఇస్తుందని, అవసరమైతే తాను కూడా ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. తన సభా వేదికను బీజేపీ గూండాలు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ.. సోమవారం రాత్రి ఆమె వేదిక వద్దే బస చేయడం గమనార్హం.
Mamata Banerjee | అభిషేక్ బెనర్జీ సవాల్..
ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రెబల్ నేతలపై నిప్పులు చెరిగారు. పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకే రెబల్స్ బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. దమ్ముంటే వారంతా తిరిగి మమత వద్దకు రావాలని, ఒకవేళ వారు వస్తే తాను గంటలోపు పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో టీఎంసీ 15 సంవత్సరాల పాలనకు బీజేపీ తెరదించే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, పార్టీలో సీనియర్ నేతలు కొందరు ఇప్పటికే బయటికి వెళ్లడం, మరికొందరు ఎన్డీయేకు మద్దతు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సభ తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్లు.. ఆందోళనలో రైతన్నలు..