Parliament Protest | పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Protest | ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా (INDIA) కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET Exam) పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయని, వారు తమ హక్కులను అడుగుతున్నారని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పేపర్ లీక్‌లు పదేపదే జరుగుతున్నాయని, శాంతియుత నిరసనలో అప్రజాస్వామికత ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదన్నారు. వారు నియంతలా పనిచేస్తున్నారని విమర్శించారు.

Parliament Protest | భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పోలీసుల మధ్య బ్యాడ్జ్‌లు లేకుండా పనిచేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులను పరోక్షంగా భయభ్రాంతులకు గురిచేయడమే వారు చేసే పని అన్నారు. తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు జంతర్​మంతర్​ వద్ద సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో వేలాదిగా విద్యార్థులు, ఆందోళనకారులు బైఠాయించారు. పార్లమెంట్ మార్చ్‌ సమయంలో చెలరేగిన హింసపై పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జంతర్ మంతర్ వద్ద అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.

 

దీనిని కూడా చదవండి : ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *