Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే సూచీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలతో కొనసాగుతోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్నా.. ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న బలమైన సంకేతాలతో మన మార్కెట్లు కోలుకుంటున్నాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 240 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 170 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 382 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 92 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 28 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 114 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.50 ప్రాంతంలో సెన్సెక్స్ 171 పాయింట్ల నష్టంతో 76,583 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 23,943 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్స్ లాభాలతో, 18 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 3.63 శాతం, ఎం అండ్ ఎం 2.13 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.98 శాతం, ఐటీసీ 0.94 శాతం, కొటక్ బ్యాంక్ 0.64 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎస్బీఐ 1.12 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.96 శాతం, ఇండిగో 0.83 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.78 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.77 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Extranet Technologies IPO | మార్కెట్‌లో ఐపీవోల సందడి.. అందుబాటులోకి ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *