Amroha Triple Marriage | ఆప్యాయతా..అక్రమ వివాహమా? వైరల్ అవుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల వింత వ్యవహారం!

"ఇది మా వ్యక్తిగత నిర్ణయం, మేమందరం కలిసి సంతోషంగా జీవిస్తాం" అంటూ ఆ ముగ్గురు సోదరీమణులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా సంస్కృతి తెచ్చిపెడుతున్న కొత్త ధోరణులను ఎత్తిచూపుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Amroha Triple Marriage | సోషల్ మీడియా మోజు, భావోద్వేగాల అనాలోచిత నిర్ణయాలు, చట్టపరమైన పర్యవేక్షణ లోపాలు కలిసి ఒకే చోట ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో చూపించే ఘటన ఇది. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Amroha Triple Marriage | విడిపోవద్దన్న ఆరాటం…

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. పెళ్లయితే వేర్వేరు ఇళ్లకు వెళ్లిపోవాల్సి వస్తుందని, తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలు దూరం అవుతాయనే ఆందోళనకు గురయ్యారు. ఒకరినొకరు వదులుకోలేక, జీవితాంతం కలిసి ఉండాలనే భావోద్వేగంతో తమ వీడియోలు చిత్రీకరించే కెమెరామెన్ వికాస్‌ను ఒకే వేదికపై వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు.

వివాహ బంధం ద్వారా దూరమయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి వారు ఎంచుకున్న ఈ మార్గం, వారి మధ్య ఉన్న అమితమైన అక్కాచెల్లెళ్ల బంధానికి అద్దం పడుతున్నప్పటికీ… వారు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.

Amroha Triple Marriage

Amroha Triple Marriage | చట్టం, యంత్రాంగాల వైఫల్యంపై విమర్శలు

ఈ వింత కల్యాణం మన సమాజంలో చట్టాల అమలు, రక్షణ యంత్రాంగాల సమర్థతపై తీవ్రమైన ప్రశ్నలను సంధిస్తోంది. భారతీయ వివాహ చట్టాల ప్రకారం బహుభార్యాత్వం నేరం. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకేసారి వివాహం చేసుకోవడం చట్టరీత్యా చెల్లదు.

NEET Paper Leak protest | నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన.. సోనం వాంగ్​చుక్​ 26 రోజుల నిరాహార దీక్షవిరమణ

స్థానిక ఆలయంలో ఇరు కుటుంబాల ప్రమేయం లేకుండా ఈ వివాహం జరుగుతున్నప్పుడు యంత్రాంగం నిద్రపోతోందా.. అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటన జరిగిన తర్వాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, రచ్చ రంబోలా అయిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించడం రక్షణ వ్యవస్థల ఆలస్యపు స్పందనకు నిదర్శనంగా నిలుస్తోంది.

Amroha Triple Marriage | సోషల్ మీడియా సంస్కృతి – వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో…!

“ఇది మా వ్యక్తిగత నిర్ణయం, మేమందరం కలిసి సంతోషంగా జీవిస్తాం” అంటూ ఆ ముగ్గురు సోదరీమణులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా సంస్కృతి తెచ్చిపెడుతున్న కొత్త ధోరణులను ఎత్తిచూపుతోంది.

రీల్స్, లైక్‌ల వేటలో సామాజిక బాధ్యత, చట్టపరిధిని మరిచిపోతున్నారా? వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో చట్టాలను, సమాజ నియమాలను తోసిరాజనడం ఎంతవరకు సమంజసమనే కోణంలో సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా, అక్కాచెల్లెళ్ల అమాయకత్వంతో కూడిన ప్రేమాభిమానాలు ఒకవైపు ఉన్నప్పటికీ… చట్టపరమైన అవగాహన రాహిత్యం, యంత్రాంగాల పర్యవేక్షణా లోపం ఈ ఘటనను ఒక పెద్ద సామాజిక వివాదంగా మార్చాయి. పోలీసులు చేపడుతున్న విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *