అక్షరటుడే, వెబ్‌డెస్క్: Opposition Protest | నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు తగ్గడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు సైతం ఈ విషయంలో నిరసనలు కొనసాగిస్తున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ స్పందించి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలన్నారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
Opposition Protest | కొనసాగుతున్న సీజేపీ నిరసన
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతన్నాయి. పేపర్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన వీడియో విడుదల చేశారు. దీంతో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించారు. అయినా కూడా తమ నిరసనలు కొనసాగుతాయని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రాజధానిలో భారీగా పోలీసులు మోహరించారు. పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
#WATCH | Delhi | Congress and Opposition MPs in Parliament protest against PM Modi and demand that he remove Union Education Minister Dharmendra Pradhan pic.twitter.com/u72rDA5yH6
— ANI (@ANI) July 24, 2026
ఇది కూడా చదవండి..: Amroha Triple Marriage | ఆప్యాయతా..అక్రమ వివాహమా? వైరల్ అవుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల వింత వ్యవహారం!