Egg Prices | గుడ్డు ధరలు పైపైకి.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు

రాష్ట్రంలో చికెన్​, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు వాటిని కొనాలంటే ఆలోచిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఎల్లారెడ్డి : Egg Prices | మధ్యతరగతి, పేద ప్రజలకు చౌకగా లభించే ఏకైక ప్రొటీన్ ఆహారం ‘కోడిగుడ్డు’ ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోంది. గుడ్ల ధరలు ఇటీవల భారీగా పెరిగాయి

Egg Prices | రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

మొన్నటివరకు రూ.6 నుంచి రూ.7 మధ్య పలికిన ఒక్కో గుడ్డు ధర (Egg Price), ప్రస్తుతం మార్కెట్లో రూ.8 నుంచి రూ.9 కు చేరింది. కేవలం గుడ్డు మాత్రమే కాకుండా, చికెన్ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.290 నుండి రూ.320 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

Egg Prices | ఉత్పత్తి వ్యయం పెరగడంతో..

గుడ్డు ధర ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కోళ్లకు మేతగా వేసే సోయాబీన్, మొక్కజొన్న, జొన్నల ధరలు విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారమైందని పేర్కొంటున్నారు. ఎండాకాలంలో కోళ్లకు సోకిన పలు రకాల వ్యాధుల వల్ల దేశవ్యాప్తంగా ఉత్పత్తి భారీగా తగ్గింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఫలితంగా చివరకు పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపలేదు. దాంతో కోళ్ల ఉత్పత్తి తక్కవ కావడంతో గుడ్లు, చికెన్ ధరలు పెరిగాయని అంటున్నారు.

Egg Prices | రవాణా ఖర్చుల భారం

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై కూడా పడింది. కోళ్ల ఫారాల నుండి మార్కెట్లకు గుడ్లు, కోళ్లను తరలించే ఖర్చులు అదనపు భారంగా మారాయి. ఒకేసారి ఒక్కో గుడ్డుపై రూ.2 వరకు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లలో ఎగ్ కర్రీస్, చికెన్ వంటకాల ధరలను సైతం వ్యాపారులు పెంచేశారు.

ఇది కూడా చదవండి..: Forgery Case | ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *