అక్షరటుడే, ఇందూరు: Self Care Day | జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రమదానం చేశారు.
Self Care Day | రోడ్డు పక్కన పొదల తొలగింపు
డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) ఆధ్వర్యంలో నాగ్పూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై శ్రమదానం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పొదలను తొలగించారు. రహదారిపై వీటి కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛందంగా శ్రమదానం చేసి రహదారిని ఆక్రమించిన చెట్లు, పొదలను తొలగించారు. ఇటీవల ఇదే రహదారిపై జరిగిన ప్రమాదంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రధాన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు మోహన్ రెడ్డి, సంతోష్, వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యం రెడ్డి, బాల్కొండ మండల అధ్యక్షుడు ప్రవీణ్, వెంకటేష్ గౌడ్, మహేష్, భూమా రెడ్డి, రవి, అరవింద్, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్, గంగాధర్, కపిల్, నాగేష్, కృష్ణ, కిషన్ గౌడ్, నర్సారెడ్డి, సంజీవ్, యూనిస్, జావేద్, ఇమ్రాన్, రియాజ్, హనుమంతు, మహేష్, భూమేష్, శివ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Egg Prices | గుడ్డు ధరలు పైపైకి.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు