అక్షరటుడే, ఇందూరు: Rajinikanth Felicitation | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్, ప్రముఖ విద్యావేత్త రజనీకాంత్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు.
Rajinikanth Felicitation | యూనివర్సిటీ అభివృద్ధికి..
ఈ సందర్భంగా బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్‌కుమార్, టీఎన్జీవో జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా రజనీకాంత్ నియమించడం సంతోషంగా ఉందన్నారు. విద్యావేత్తగా ఆయనకున్న అనుభవం యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్సిటీని మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్లాలని రజనీకాంత్‌ను కోరారు. కార్యక్రమంలో నాయకులు మనోజ్, సుమన్, రంజిత్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Medicover Hospital | క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం: మెడికవర్ ఆస్పత్రి వైద్యులు

