Stock Market Today | ఐదో రోజూ నష్టాలే..

దేశయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాల బాటలో పయనించింది. సెన్సెక్స్ 331 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్లు పడిపోయాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Stock Market Today | అమెరికా, ఇరాన్ ( Iran )మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లు దాటాయి. దీనికి ట్రంప్ టారిఫ్‌లు తోడయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.

Stock Market Today | రోజంతా నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 683 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట 287 పాయింట్లు పెరిగింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో మరో 521 పడిపోయింది. 223 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడనుంచి 97 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్ తో వెంటనే 157 పాయింట్లు పడిపోయింది. తర్వాత మార్కెట్లు కోలుకుని పైకి ఎగబాకి ప్రారంభ నష్టాలను తగ్గించుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టంతో 76,059 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల నష్టంతో 23,767 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,124 కంపెనీలు లాభపడగా 2,053 స్టాక్స్ నష్టపోయాయి. 208 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 93 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 99 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Today |Top Gainers..

బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్ 2.08 శాతం, ఐటీసీ 0.78 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.58 శాతం, టీసీఎస్ 0.52 శాతం, ట్రెంట్ 0.48 శాతం లాభపడ్డాయి.

Top Losers..

ఎటర్నల్ 2.34 శాతం, ఎం అండ్ ఎం 2.10 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.07 శాతం, ఎయిర్‌టెల్ 1.66 శాతం, ఆసియన్ పెయింట్ 1.09 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి:  Paper Leak Bill | పేపర్‌ లీకేజీలపై కఠిన శిక్షలు.. బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *