అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJYM District President | కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని.. యువతను సంఘటితం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండల బీజేపీ నాయకులు (BJP Telangana) ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
BJYM District President | నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
ఈ సందర్భంగా వంశీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ నాపై నమ్మకంతో బీజేవైఎం (BJP Youth Wing) జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందని.. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తాననన్నారు. ఎంపీ అర్వింద్(MP arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా బీజేపీ చీఫ్ దినేష్ కులాచారి ఆదేశాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్