అక్షరటుడే, వెబ్డెస్క్: Madanapalle ATM Theft | దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న స్థానికులను గన్తో బెదిరించారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా (Annamayya District)లో చోటు చేసుకుంది.
మదనపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని SBI ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో కొందరు స్థానికులు చూసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగలు వారికి గన్ చూపించి బెదిరించారు. నలుగురు దొంగలు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎంను తీసుకొని పరారు అయ్యారు.
Madanapalle ATM Theft | ప్రత్యేక బృందాలతో గాలింపు
ఏటీఎం చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బొలెరో వాహనంలో ఏటీఎంను తీసుకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులు వాయల్పాడు, కూరపర్తి, నిమ్మనపల్లి మీదుగా పరారు అయ్యారు. వారి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల దొంగల కోసం గాలిస్తున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏటీఎంలో రూ.10 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం.
AP : మదనపల్లెలో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని SBI ఏటీఎం మిషన్ను పెకలించి తీసుకెళ్లిన నలుగురు దొంగలు#Madanapalle #SBIATM #AndhraPradesh #Theft #BreakingNews pic.twitter.com/Hw3eRHWD3s
— Akshara Today | Telugu News (@aksharatoday) July 25, 2026
ఇది కూడా చదవండి..: Chandrababu School Visit | విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్