అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ekadashi Celebrations | జిల్లావ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
Ekadashi Celebrations | నగరంలోని జెండా మందిరంలో..
ఉదయం నుంచే పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. నగరం (Nizamabad)లోని ప్రముఖ దేవాలయమైన జెండా బాలాజీ మందిరంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయంలో వేకువజాము నుంచే స్వామివారికి సుప్రభాత సేవ, పవిత్ర అభిషేకాలు, విశేష పుష్పాలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పవిత్ర స్నానాలు.. ఉపవాసాలు..
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించి, రోజంతా ఉపవాస దీక్షలు నిర్వహించనున్నారు. ఆలయాల్లో సైతం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏకాదశి రోజు ఆచరించే ఉపవాసం మానసిక ప్రశాంతతను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.
ఇది కూడా చదవండి..: Bhoolakshmi Mata Bonalu | ఇందూరులో అంగరంగ వైభవంగా భూలక్ష్మి మాత బోనాలు