ఇందూరు, అక్షరటుడే: Bhoolakshmi Mata Bonalu | నిజామాబాద్ నగరంలోని (Nizamabad) వినాయక్ నగర్‌లో ఉన్న శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో ఆదివారం బోనాల పండుగ (Bonalu Festival) అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
Bhoolakshmi Mata Bonalu | భక్తిశ్రద్ధలతో..
ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మేయర్ కూరగాయల ఉమారాణి, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాడి కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు.
6వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతి రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ మేకల మల్లేష్ యాదవ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ ఛైర్మన్ గైని గంరారం, మాజీ ఎంపీపీ బాజిరెడ్డి రమాకాంత్, మాజీ కార్పొరేటర్ అంతిరెడ్డి లత దేవేందర్ రెడ్డి, కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడు పాల్తి రవికుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు పడిగెల రాజా ప్రవీణ్, షిర్డీ సాయినగర్ కాలనీ అధ్యక్షుడు (రిటైర్డ్ ఎస్సై) పడాల భూమయ్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ వేడుకల నిర్వహణలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, గౌరవ అధ్యక్షుడు తోట గోపాల్, అధ్యక్షుడు పడకంటి సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మిద్దె రవికుమార్, కోశాధికారి జి. బుర్ర పరశురామ్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుందన తులసీదాస్, పాఠశాల స్కూల్ కరస్పాండెంట్ మేక శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ