Chaganti Koteswara Rao | భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి: ఎమ్మెల్యే ధన్​పాల్​

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Chaganti Koteswara Rao | లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూరు(Nizamabad) గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారులోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్​లో ‘గోమాత వైభవం’పై (Gomata Vaibhavam) ప్రవచనం నిర్వహించారు.

Chaganti Koteswara Rao | చాగంటికి ఘనస్వాగతం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్​పాల్ చాగంటి కోటేశ్వర రావుకు ఘనస్వాగతం పలికి సన్మానించి మాట్లాడారు. తన అద్భుతమైన ప్రవచనాలతో రామాయణం, భారతం, భాగవతం వంటి మహా గ్రంథాల్లోని విలువలను సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా చాగంటి వివరిస్తారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కుటుంబ విలువలు(anatana Dharma), ధర్మం గొప్పతనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవ అమూల్యమైందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి చేస్తున్న యజ్ఞం ఎంతో గొప్పదన్నారు. ఇందూరులో గోమాత వైభవంపై ప్రవచనం చెప్పడానికి రావడం ఇక్కడి భక్తుల పూర్వ జన్మ సుకృతం అన్నారు. సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముక్కోటి దేవతలను గోవులో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

kot11 kotttt

ఇది కూడా చదవండి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *