అక్షటుడే, పెద్ద కొడప్గల్: Rahul Gandhi Protest | నీట్ అంశాన్ని పార్లమెంట్లో చర్చించకుండా ప్రధాని మోదీ (PM Modi) ఇంటిని రాహుల్‌గాంధీ ముట్టడించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు మల్లాయల సుభాష్ విమర్శించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Rahul Gandhi Protest | నీట్ రాసిన విద్యార్థులు ఆందోళనలో లేరు
ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు కాని ఆందోళనల్లో పాల్గొనలేదన్నారు. నీట్ పరీక్షలు రాసిన వారేమో సంతోషంగా ఉంటే ఈ పరీక్షకు సంబంధం లేని వారు ప్రధాని నివాసాన్ని ముట్టడించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. తెలంగాణలో పది, ఇంటర్ పరీక్షల పేపర్లు లీక్ కాగా.. ఇక్కడి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ekadashi Celebrations | భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు