Bihar Student Protest | బీహార్​లో విద్యార్థుల నిరసన హింసాత్మకం..

బీహార్​లో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bihar Student Protest | నీట్ పేపర్ లీకేజీపై బీహార్​లో విద్యార్థులు, యువత శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు.

నీట్ పేపర్ లీక్ అంశం, రాష్ట్రంలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యకు నిరసనగా ఈ రోజు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. పాట్నాలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. మరోవైపు ఔరంగాబాద్‌లో రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను అక్కడికి పంపారు.

Bihar Student Protest | పోలీసు వాహనాల ధ్వంసం

పాట్నాలో నిరసన సందర్భంగా ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్​చేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Bihar Student Protest | తేజ్​ ప్రతాప్​ యాదవ్ అరెస్ట్

పాట్నాలో జేజేడీ జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్, విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా గాంధీ మైదాన్‌లో నిరసన తెలుపుతున్న వారితో కలిశారు. ఆ తర్వాత నిరసన సందర్భంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి..: Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్​ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *