KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్​ స్టూడెండ్​ బిల్డర్​ గ్రూప్’​ ప్రారంభం

నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: KITW | నగరంలోని(Nizamabad) కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (KITW)లో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ దిగ్గజ సంస్థ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ (AWS)కు చెందిన ‘ఏడబ్ల్యూఎస్​ స్టూడెంట్ బిల్డర్ గ్రూప్’ ప్రోగ్రామ్‌ను కళాశాల ప్రాంగణంలో ఈ రోజు ఘనంగా ప్రారంభించారు.

​KITW |ఆన్‌లైన్ వెబినార్.. గ్లోబల్ ఎక్స్‌పోజర్

ఏడబ్ల్యూఎస్​ క్లౌడ్ ఇంజినీర్ రుద్రమధబా మిశ్ర ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులకు ‘ఆధునిక క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ’ (Cloud Computing Technology) అనే అంశంపై ప్రత్యేక వెబినార్ (Amazon Web Services) నిర్వహించారు. ఐటీ రంగంలో క్లౌడ్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యతను, భవిష్యత్ అవకాశాలను ఆయన సులభరీతిలో వివరించారు.

​KITW | క్లౌడ్​ కంప్యూటింగ్​ టెక్నాలజీ అవసరం

​ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్వకుమార్ రాజా మాట్లాడుతూ.. ‘నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఎంతో అత్యవసరమన్నారు. ఏడబ్ల్యూఎస్​ స్టూడెంట్ బిల్డర్ గ్రూప్ ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇది వారి భవిష్యత్ కెరీర్‌కు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ప్రాక్టికల్​ ప్రాజెక్ట్​లు చేసేందుకు..

అనంతరం ​వైస్ ప్రిన్సిపాల్ సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ స్టూడెంట్ బిల్డర్ గ్రూప్స్ ద్వారా విద్యార్థినులకు కేవలం సిద్ధాంతపరమైన (Theoretical) జ్ఞానమే కాకుండా, ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌లు చేసేందుకు ‘హ్యాండ్స్-ఆన్ లాబ్స్’ (Hand-on Labs) అందుబాటులోకి వస్తాయన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాబోయే టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవడానికి ఇదొక అద్భుతమైన వేదిక అని అన్నారు. ​ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ పి. నాగార్జున్, ఏడబ్ల్యూఎస్​ ఎస్​బీజీ కోర్​టీం సభ్యులు, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: #Breaking news : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *