అక్షరటుడే, డిచ్పల్లి: Nagesh Reddy | ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు. డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Nagesh Reddy | వర్షాభావం కారణంగా..
ఎల్నినోతో వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలు తగ్గిపోతున్నందున మొక్కజొన్న, కందులు, పత్తి, సోయ లాంటి పంటలు పండించాలని నగేష్ రెడ్డి సూచించారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని కోరారు. దేశంలో 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ హయంలో ఎన్నో కుంభకోణాలు, అవినీతి, పేపర్ లీకేజీలు అయ్యాయని. వాటికి బాధ్యులుగా ఏ ఒక్క మంత్రి కూడా బాధ్యత వహించలేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి చదివిస్తుంటే నీట్ లాంటి పేపర్ లీకేజీలు బీజేపీ ప్రభుత్వంలో అవుతున్నాయన్నారు.
విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ నిరసన కార్యక్రమం చేస్తుంటే వారికి అక్రమంగా అరెస్ట్ చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలో మరొకసారి రేవంత్ రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. అటు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ డిచ్పల్లి అధ్యక్షుడు అంబర్ సింగ్, ఐడీసీఎంస్ మాజీ ఛైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ ఎంపీపీ నర్సయ్య, పీఏసీఎస్ ఛైర్మన్లు గంగారెడ్డి, నాయకులు రాంచందర్ గౌడ్, శ్రీనివాస్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్ స్టూడెండ్ బిల్డర్ గ్రూప్’ ప్రారంభం