అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constable Pramod | నగరంలో రౌడీషీటర్ రియాజ్ దాడిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు టెర్మినల్ గ్రూప్ ముందుకొచ్చింది. ప్రమోద్ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం ప్రకటించింది.
Constable Pramod | డీజీపీ కార్యాలయంలో..
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ప్రమోద్ తల్లికి, సతీమణికి చెక్కును అందజేశారు. టెర్మినల్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్ఎల్ఎన్ రెడ్డి బోధన్‌లో గతంలో డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించడంతో ఎస్పీ రెడ్డి స్పందించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇద్దరు పిల్లల ఫీజలకు సంబంధించిన మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

