అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jantar Mantar Protest | ఢిల్లీలోని జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆందోళనలు విరమించడంతో అక్కడ విధించిన ఆంక్షలను అధికారులు క్రమంగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించారు.
Saudi Houthi Attacks | సౌదీ, హౌతీల మధ్య పరస్పర దాడులు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం!
Jantar Mantar Protest | నిశితంగా పరిశీలన
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు నిరసనలను విరమించి తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో జంతర్‌మంతర్‌లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం జంతర్‌మంతర్ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.