అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చింది. హన్మకొండలోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. (KTR), హరీష్ రావు ఇప్పటికే హన్మకొండకు బయలు దేరారు. అయితే ఆయన మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వాటిని వైద్యులు ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నాడు, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. మరణ వార్తలు అవాస్తవం అన్నారు. హార్ట్ బీట్ వచ్చింది, ప్రస్తుతం నిలకడగా ఉన్నాడన్నారు.
Peddi Sudarshan Reddy | పార్టీలో సేవలు
పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన 2019లో బీఆర్ఎస్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.
దీనిని కూడా చదవండి : Telangana Rain Alert | రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి వర్షాలు