అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్లోని(Hyderabad) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ నిర్వహించారు.
Nizamabad Collector | గర్భిణిగాను విధుల్లో చురుకుగా..
నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎస్ఐఆర్ పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ జిల్లా అధికారులకు ఆదేశాలిస్తూ ఆమె విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా 23వ తేదీన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.