అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mirabai Chanu Gold | గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన సత్తా చాటింది.
మహిళల 48 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త రికార్డును కూడా నెలకొల్పింది. ఈ విజయంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
స్నాచ్ విభాగంలో మీరాబాయి తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువును ఎత్తడంలో విఫలమైనా, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా పూర్తి చేసింది.
అనంతరం చివరి ప్రయత్నంలో 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. గతంలో 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించిన ఆమె, మరోసారి అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
అమెరికా దాడులకు విరామం.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిత్రదేశాలపై ప్రతీకార దాడులు నిలిపివేసిన ఇరాన్
Mirabai Chanu Gold | రిషికాంత్ సింగ్‌కు రజతం
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్‌లో 121 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కేజీలు ఎత్తి మొత్తం 264 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు.
స్నాచ్ విభాగంలో 121 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో పాటు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు.
Mirabai Chanu Gold | మలేషియాకు స్వర్ణం.. కెన్యాకు కాంస్యం
పురుషుల విభాగంలో మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ కాస్దాన్ మొత్తం 273 కేజీలు ఎత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో అతను చూపిన అద్భుత ప్రదర్శన విజయంలో కీలకంగా నిలిచింది. మరోవైపు భారత ఆటగాడు చివరి ప్రయత్నంలో 151 కేజీల బరువును ఎత్తడంలో విఫలమవడంతో స్వర్ణ పతకం చేజారింది.
కెన్యాకు చెందిన జోషువా ఎంబోయా మొత్తం 260 కేజీల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన దేశానికి మరోసారి పతకాల ఆనందాన్ని అందించింది.