Akhilesh Yadav | విద్యా రంగాన్ని నాశనం చేసిన బీజేపీ : అఖిలేశ్​ యాదవ్​

బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగాన్ని నాశనం చేసిందని ఎంపీ అఖిలేశ్​ యాదవ్​ ఆరోపించారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Akhilesh Yadav | కేంద్ర ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్​, ఎంపీ అఖిలేశ్​ యాదవ్​ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.పార్లమెంట్​ ఆవరణలో అఖిలేశ్​ యాదవ్​ మీడియాతో మాట్లాడారు.

విద్య, పరీక్షలకు సంబంధించిన పోరాటం చాలా పెద్దదన్నారు. యువతలో ఉన్న చైతన్యాన్ని, వారి మనోబలాన్ని ఆయన అభినందించారు. వారి చైతన్యాన్ని ఈ ప్రభుత్వం సవాలు చేయలేదన్నారు. పరీక్షల సంస్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాజ్​వాది పార్టీ అధినేత స్పందిస్తూ.. ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్‌ను ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. 2014లోనే ఎందుకు ఏర్పాటు చేసి ఉంటే.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందేదన్నారు.

Akhilesh Yadav | ఎంఐఎంతో పొత్తుపై..

ఉత్తరప్రదేశ్​ (Uttar Pradesh) ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఎస్పీతో పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదన చేశారు. దీనిపై అఖిలేశ్​ మాట్లాడుతూ.. ఎవరితోనూ పోరాడకండి. దాని అవసరం లేదు. మేము ఇప్పటివరకు అనుసరించిన మార్గంలోనే ముందుకు సాగుతాం అని తెలిపారు. కాగా సమాజ్​వాది పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: IDFC First Bank Q1 Results | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దూకుడు.. ఇంట్రాడేలో 10 శాతం జంప్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *