Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Student Breakfast Scheme | సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ కావని, అవి ప్రభుత్వం ప్రజలపై పెట్టే పెట్టుబడులని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇటువంటి పెట్టుబడులు పౌరులు సామాజికంగా, ఆర్థికంగా పురోగమించడానికి సహాయపడతాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే కేంద్రీకృత సామూహిక వంటశాలను భట్టి విక్రమార్క మధిర (Madhira) నియోజకవర్గంలో సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ బిడ్డ కూడా ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విద్యార్థులకు ప్రతి ఉదయం పరిశుభ్రమైన, రుచికరమైన, పోషకమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఉచిత అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.

Student Breakfast Scheme | మానవ వనరులే సంపద

మానవ వనరులే రాష్ట్రానికి అతిపెద్ద సంపద అని భట్టి పేర్కొన్నారు. ప్రతిభావంతులైన, సమర్థులైన మానవ వనరులు ఉన్నప్పుడే రాష్ట్రం శక్తివంతమవుతుందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. హరే కృష్ణ మిషన్‌ (Hare Krishna Mission) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక కేంద్రీకృత వంటశాల 16 మండలాల్లోని పాఠశాలలకు అల్పాహారం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కేంద్రీకృత వంటశాలలు రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. అల్పాహారంతో పాటు వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి మాల్ట్ అందిస్తామని చెప్పారు.

దీనిని కూడా చదవండి : HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు ఆదేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *