అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NEET Protest Cases | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం విధించింది. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను రద్దు చేస్తామని మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పేర్కొంది. లేదంటే మరోసారి ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. నిరసనల్లో భాగంగా ఈ నెల 20న ఆందోళనకారులు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సీజేపీ షరతులు పెట్టింది. వీటికి కేంద్రం ఒప్పుకోవడంతో నిరసనలు విరమించింది.
NEET Protest Cases | విద్యార్థులను అరెస్ట్ చేయడంతో..
నిరసనకారులపై పోలీసు చర్యలు తీసుకోకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘించారన్ని సీజేపీ పేర్కొంది. బీహార్, బెంగాల్‌లలో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపింది. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలలో వందలాది మందిపై నిఘా పెట్టారని ఆరోపించింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులను విడుదల చేయాలని సీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కాగా కేసుల ఉపసంహరణకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
🚨 CJP spokesperson Ashutosh Ranka says the government was supposed to share the written agreement on withdrawal of FIRs against protesters and assurance of no fresh cases by Tuesday after both sides’ lawyers review the draft.
He warns that if the agreement is not shared and…
— Hemant Rajaura (@hemantrajora_) July 27, 2026
దీనిని కూడా చదవండి : Nitin Gadkari Deepfake | నితిన్ గడ్కరీ డీప్‌ఫేక్ వివాదం.. పరువు నష్టం దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్