అక్షరటుడే, కోటగిరి : Tirmalapur Gram Sabha | తిర్మలాపూర్ (Tirmalapur) గ్రామపంచాయతీలో పలు తీర్మానాలు చేశారు. నీటి వృథా చేసినా.. గంజాయి అమ్మినా.. తీసుకున్నా భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
Tirmalapur Gram Sabha | పోతంగల్ మండలం తిర్మలాపూర్‌లో..
పోతంగల్ (Pothanagal) మండలం తిర్మలాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ పెద్దలతో కలిసి సర్పంచ్ సైదవ్వ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బోయి సైదవ్వ మాట్లాడుతూ.. గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి నల్లాకు టాప్ పెట్టుకోవాలని సూచించారు. నీటిని వృథా చేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. నీటి నిల్వ కోసం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చేయరాదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని.. మలవిసర్జనకు బయటకు వెళ్తే రూ.5వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
Tirmalapur Gram Sabha | గంజాయి అమ్మకాలు నిర్వహిస్తే..
డ్రగ్స్, గంజాయి(Anti Drug Campaign) ఎవరైనా అమ్మినా.. సేవించిన వారిని పట్టిస్తే వారికి రూ.10వేల రివార్డు జీపీ తరపున ఇస్తామని సర్పంచ్ వివరించారు. అలాగే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయి తాగుతూ పట్టుపడితే పోలీసుశాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. కిరాణా షాప్‌లో 21ఏళ్లు నిండనివారికి సిగరెట్, గుట్కా వంటివి అమ్మితే రూ.5000 జరిమానా విధిస్తామన్నారు. అలాగే కిరాణా షాప్‌లో గడువు ముగిసిన వస్తువులు అమ్మితే సైతం రూ.5వేల విధిస్తూ జీపీ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్, వార్డు సభ్యులు, ఆస్మా బేగం, రమాబాయి, లక్ష్మీబాయి, లక్ష్మి, కాశయ్య, సీఏ అనుజ, ఫీల్డ్ అసిస్టెంట్ జైరాం, గంగాధర్, శంకర్ పటేల్, నాగేశ్వరరావు పటేల్, లింగయ్య, లాలయ్య, డ్వాక్రా సంఘాల మహిళలు, హన్మవ్వ, సుజాత, రుక్కవ్వ, నఫిసా, పోశవ్వ పాల్గొన్నారు.