Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్‌డీ విచారణ.. నిధుల గోల్​మాల్​పై సర్వత్రా చర్చ

బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) షాహిద్ మసూద్ మంగళవారం విచారణ చేపట్టారు.

shashi kiran Mottala

అక్షర టుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) షాహిద్ మసూద్ మంగళవారం విచారణ చేపట్టారు. ఉదయమే బోధన్​ (Bodhan) పట్టణానికి చేరుకున్న ఆయన బల్దియాలో సమీక్ష నిర్వహించారు.

Bodhan Municipality | గతంలో జరిగిన అవకతవకలపై..

కమిషనర్ ఛాంబర్‌లో సుమారు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. గతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై లోతుగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా, 16వ వార్డులోని శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి కేటాయించిన రూ.20 లక్షల నిధుల వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు ఆర్‌డీ ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ, మాజీ డీఈ శివానందం, ఏఈ శ్రీనివాస్, మాజీ ఛైర్మన్ ఎల్లయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇలియాస్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *