Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ (Trainee)​ ఉదయ్​ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. మిర్యాలగూడ (Miryalaguda)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉదయ్​ కృష్ణారెడ్డి హైదరాబాద్​లోని జాతీయ పోలీస్​ అకాడమీ (National Police Academy)లో శిక్షణ పొందుతున్నారు. మరో మహిళ ట్రైనీ ఐపీఎస్​ను ఆయన లైంగికంగా వేధించినట్లు కేసు నమోదు అయింది. తనను వేధించడంతో పాటు బ్లాక్​ బెయిల్ చేశాడని బాధితురాలు అత్తాపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో తనపై ఆరోపణలు అవాస్తవం అని ఆయన ఖండించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే అత్తాపూర్​ ఠాణా నుంచి కేసును నగర కమిషనర్​ సజ్జనార్​ ఉమెన్స్​ సేఫ్టీవింగ్​కు బదిలీ చేశారు.

Uday Krishna Reddy Arrest | పరారీలో ఉండటంతో..

తనపై కేసును కొట్టివేయాలని ఉదయ్​ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో కనిపించకుండా పోయారు. పోలీసులు నోటీసులు అందించడానికి వెళ్తే అందుబాటులో లేరు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని మంగళవారం ఉదయం ఆయన తెలిపారు. నానమ్మ అనారోగ్యంతో స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని తెలిపారు. తన స్వగ్రామం నుంచి వస్తున్న ఉదయ్​ కృష్ణారెడ్డిని నగర పోలీసులు మిర్యాలగూడలో అరెస్ట్​ చేశారు. అనంతరం హైదరాబాద్​కు తరలించారు.

దీనిని కూడా చదవండి : Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *