KTR Hydraa Allegations | హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్​రెడ్డి వసూళ్లు : కేటీఆర్

హైడ్రాను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్​రెడ్డి బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Hydraa Allegations | హైడ్రా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి వేట కుక్కలా మారిందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. ఈ సంస్థను అడ్డుపెట్టుకొని బిల్డర్ల దగ్గర RR టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీలో కేటీఆర్​ మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా నిజంగానే మంచిపనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌసులు ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే హైడ్రాని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తామని తెలిపారు.

KTR Hydraa Allegations | పేదలపై ప్రతాపం

బడా బాబులను వదిలిపెట్టి.. పేదల మీద హైడ్రా పడుతుందని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి (Ponguleti) ఇల్లు చెరువులో ఉంటే దాన్ని హైడ్రా ముట్టదన్నారు. వివేక్, సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువులో ఉన్నా.. వాటి జోలికి వెళ్లదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల విస్తీర్ణం 16 లక్షల ఎకరాల నుండి దాదాపు కోటి ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. రేవంత్​ రెడ్డి సోదరులు, కాంగ్రెస్​ మంత్రులు అందరి కంటే ఎక్కువ దోచుకున్నారని ఆరోపించారు.

KTR Hydraa Allegations | పాలన చేతగాకా నిందలు

కరోనా (Corona) సమయంలో కూడా కేసీఆర్​ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందన్నారు. తాము వాటిని చెల్లించామని తెలిపారు. అప్పులతో పాటు ఆదాయం కూడా సృష్టించి, ఒక సంపన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టామని తెలిపారు. కానీ పరిపాలన చేతగాక సీఎం రేవంత్​రెడ్డి తమ మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

KTR Hydraa Allegations | యువత తిరగబడింది

బీజేపీ (BJP), కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలతో యువత తిరగబడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్​లైన్​లో మొదలైన ఉద్యమం, జంతర్ మంతర్ వరకు చేరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల, వాళ్లు ప్రజలకు మద్దతుగా నిలబడలేక యువత నేరుగా ఉద్యమం చేస్తున్నారని చెప్పారు.

KTR Hydraa Allegations | కాజీపేట డివిజన్​ ఏర్పాటు చేయాలి

కాజీపేటలో డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ తెలిపారు. 900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారని, 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు అయ్యిందని గుర్తు చేశారు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్ట్ షేరింగ్ చేసుకోవడంతో సగం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణతో పనులు ఆగిపోయాయని విమర్శించారు. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరామన్నారు.

దీనిని కూడా చదవండి : Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *