Voter Enumeration Drive | అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలి

అర్హులందరికీ ఓటుహక్కు తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Voter Enumeration Drive | అర్హులందరికీ ఓటుహక్కు తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని బీజేపీ(Kamareddy bjp) జిల్లా అధ్యక్షడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో 17బూత్​ల బీఎల్​ఏలతో సమావేశం నిర్వహించారు.

Voter Enumeration Drive | డబుల్​ ఓట్లు తొలగిపోయేలా చూడాలి..

ఈ సందర్భంగా నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. ఓటర్​లిస్ట్​లో డబుల్​ ఓట్లు తొలగిపోయేలా చూడాలన్నారు. ఇంకా ఎవరికైనా ఎన్యూమనేషన్ ఫారం అందకపోతే దగ్గరుంచి వారికి అందేలా చూడాలని పేర్కొన్నారు. ఎవరైనా ఓటర్లు ఇతర చోట్ల ఉన్నట్లయితే వారు ఆన్​లైన్​లో అయినా ఎన్యూమరేషన్​ ఫారం నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే బీఎల్​వోలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్​, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, సీనియర్ నాయకులు బలరాజ్, యాదగిరి, మల్లయ్య, కాశీనాథ్, యువ నాయకులు గజానన్, రమేష్, శివ, రవి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘‘నీకు ఎవరైనా నచ్చలేదా వదిలేయ్. వాళ్లను హేట్ చేయడం, ట్రోల్ లాంటివి చేయొద్దు. ఆ సమయాన్ని మీ కోసం ఉపయోగించుకోండి’’ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *