అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.
భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. మేడిపల్లి, చాదర్‌ఘాట్, బైబిల్ హౌస్, చిలకలగూడ ఎక్స్ రోడ్, కేసీపీ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, వాహనాల నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. చాదర్‌ఘాట్ ప్రాంతంలో రెండు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
Hyderabad Heavy Rain | పోలీసుల హై అలర్ట్
భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్ సింగ్, రాహుల్ హెగ్డే లక్డీకాపుల్, అయోధ్యజంక్షన్, మసబ్‌ట్యాంక్ సహా నీరునిలిచిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. అనేక ప్రదేశాలలో నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలు మందగించడంతో, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి నగరం అంతటా ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.
Hyderabad Heavy Rain | బయటకు వెళ్లొద్దు
వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. ప్రయాణం తప్పనిసరి అయితే, నెమ్మదిగా వాహనం నడపాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణానికి అదనపు సమయం తీసుకోవాలన్నారు.
Massive Traffic Jam near #IKEA Junction, as Heavy Rain Lashed Several Parts of #Hyderabad , including Madhapur, Gachibowli, Miyapur on Tuesday evening.
Due to #HeavyRains , #Waterlogging has been reported many places in the city, resulting in slow-moving… pic.twitter.com/ZU51PwyT5P
— Surya Reddy (@jsuryareddy) July 28, 2026
దీనిని కూడా చదవండి : Guru Purnima 2026 | గురు పూర్ణిమ 2026.. పర్వదిన విశిష్టత, పూజా ముహుర్తాలు ఇవే!