HYDRAA High Court | హైడ్రా చర్యలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం..రెండు కేసుల్లో కీలక ఆదేశాలు

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వడానికి సంబంధిత తహసీల్దార్ ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: HYDRAA High Court | హైడ్రా (HYDRAA) చర్యలపై తెలంగాణ Telangana హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైడ్రా తీసుకున్న చర్యలను హైకోర్టులోని రెండు బెంచ్‌లు తప్పుబట్టాయి.

HYDRAA High Court | బోర్డును 24 గంటల్లోపు తొలగించాలంటూ..

ఒక కేసులో ప్రైవేట్ స్థలంలో హైడ్రా బోర్డు ఏర్పాటు చేసిన తీరును హైకోర్టు ప్రశ్నించింది. సంబంధిత బోర్డును 24 గంటల్లోపు తొలగించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి, తదుపరి విచారణలో నివేదిక సమర్పించాలని సూచించింది.

HYDRAA High Court | తప్పుడు సమాచారం అందించినట్లు..

మరో కేసులో కోర్టుకు తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించిన సంబంధిత తహసీల్దార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వడానికి సంబంధిత తహసీల్దార్ ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

హైడ్రా చర్యలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, ప్రజల హక్కులకు భంగం కలగకుండా అధికారులు వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు కేసులకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు నిర్ణయించిన తేదీకి వాయిదా వేసింది.

Nizamabad Rice Scam | రెండు లక్షల క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం మేసిన ప్రముఖ వ్యాపారి కాపర్తి శ్రవణ్! రూ.66 కోట్ల ప్రజాధనం మింగేశాడుగా!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *