July 29 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రపంచ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్ట్ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 29 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో యూరోప్ మార్కెట్లు లాభాల పరంపరను కొనసాగించగా.. వాల్‌స్ట్రీట్ Wall Street మిక్స్‌డ్‌గా ముగిసింది. ఆసియా మార్కెట్లు గ్లోబల్ ట్రెండ్ ను అనుసరిస్తున్నాయి. కాగా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌(Gap Up)లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

July 29 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

ఎస్ అండ్ పీ 0.21 శాతం పెరగ్గా.. నాస్‌డాక్ 0.22 శాతం పడిపోయింది. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం నష్టంతో ఉంది.

July 29 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.40 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.62 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.82 శాతం లాభపడ్డాయి.

July 29 Horoscope | ఊహించని ఆర్థిక లాభాలు..ఈ రాశుల వారికి బిగ్ ట్విస్ట్!

July 29 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.29 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.15 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.77 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.30 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.79 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.51 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు తమ కొనుగోళ్ల మద్దతును కొనసాగిస్తుండగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నాలుగు సెషన్ల అమ్మకాల పరంపరకు ముగింపు పలికి గత సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచనుంది.

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 755 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,664 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 95.85 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.40 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.62 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.11 నుంచి 1.05 కు తగ్గింది.
  • విక్స్ 0.77శాతం తగ్గి 12.56 కు చేరింది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.93 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *