Russia Oil Sanctions | రష్యా చమురు టార్గెట్‌గా అమెరికా కొత్త బిల్లు.. భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్..?

ఇంధన ఎగుమతులతో రష్యా ఆర్జిస్తోన్న ఆదాయాన్ని కట్టడి చేసేందుకు అమెరికా మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Russia Oil Sanctions | ఇంధన ఎగుమతులతో రష్యా ఆర్జిస్తోన్న ఆదాయాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ( America )మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రష్యాపై కొత్తగా ఆంక్షల బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును పరిశీలించేందుకు అమెరికా సెనెట్ సభ్యులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన కనుక చట్టరూపం దాల్చితే.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలపై భారీగా టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉంది.

Russia Oil Sanctions | బిల్లు రూపకల్పన..

రష్యాపై ఆంక్షల బిల్లు ఆమోదం కోసం సెనెట్‌లో ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ బిల్లును పరిశీలించేందుకు 86-12 భారీ తేడాతో సెనెట్ సభ్యులు అంగీకరించారు. అయితే, ఇది చట్టంగా మారాలంటే సెనెట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ అన్ని దశలు పూర్తయి బిల్లు చట్టరూపం దాల్చితే.. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు లభిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించి మద్దతు కోరిన తరుణంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Russia Oil Sanctions | ఇంధన ఎగుమతులే టార్గెట్..

2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపా దేశాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతున్నప్పటికీ.. రష్యాను ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా దెబ్బతీయలేకపోయాయి. దీంతో పుతిన్ ప్రభుత్వం ఇంధన ఎగుమతుల ద్వారా గడిస్తున్న భారీ ఆదాయానికి గండి కొట్టడమే లక్ష్యంగా అమెరికా ఈ తాజా వ్యూహానికి తెరతీసింది.

Russia Oil Sanctions | భారత్‌పై ప్రభావం ఎంత?

ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి పశ్చిమ దేశాల హెచ్చరికలను లెక్కచేయకుండా భారత్ రష్యా నుంచి నిరంతరం చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. తక్కువ డిస్కౌంట్ ధరలకు లభిస్తుండటంతో భారతీయ రిఫైనరీలు రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌తో పాటు చైనా, జపాన్, కొన్ని ఐరోపా దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఒకవేళ అమెరికా ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు కనుక ఆమోదం పొందితే.. పరోక్షంగా భారత్ వంటి దేశాలపై టారిఫ్‌ల భారం పడే ముప్పు పొంచి ఉంది. అయితే ప్రస్తుతానికైతే వాణిజ్య ఒప్పందాల్లో ఎలాంటి మార్పులు లేవు.

ఇది కూడా చదవండి:  Manhole Accident | మ్యాన్​హోల్​లో పడి వృద్ధుడి గల్లంతు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *