Nizamabad Premier League | క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Premier League | క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ(Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడాపోటీలు శనివారం డీఎస్​ఏ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షబ్బీర్​ అలీ హాజరయ్యారు.

Nizamabad Premier League | యువత కోసం

షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి లీగ్ పోటీలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు.

Nizamabad Premier League | సీఎం ప్రత్యేక దృష్టి..

రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని షబ్బీర్ అలీ వివరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు శాస్త్రీయ శిక్షణ, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ, స్టేడియాలు, కోచింగ్ సెంటర్లు, జిమ్నేషియంలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును భద్రపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Nizamabad Premier League | వివిధ రకాల పోటీలు..

నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి విభిన్న క్రీడల్లో పోటీలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, నిజామాబాద్​ సెక్యూరిటీ ​కౌన్సిల్ (Nizamabad Security Council)​ ఛైర్మన్​ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్​ రజనీకాంత్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

2 3 5 6

ఇది కూడా చదవండి: Hyderabad Metro | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రోలో ఎల్​ అండ్​ టీ వాటాలు స్వాధీనం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *