Gujarat Murder Case | గుజరాత్‌లో దారుణం.. భర్తను చంపి ఆస్ట్రేలియాలో ఉన్నాడంటూ నమ్మించిన భార్య

గుజరాత్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gujarat Murder Case | గుజరాత్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో భార్య పృథ్వీ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి పాతిపెట్టి, భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి రెండేళ్లుగా అందరినీ నమ్మిస్తూ వచ్చింది.

Gujarat Murder Case | రెండేళ్లుగా నమ్మిస్తూ ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మావడియా రెండేళ్లుగా కనిపించకుండా పోయాడు. అయితే అతని భార్య పృథ్వీ మాత్రం తన భర్తకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని, అక్కడే ఉన్నాడని బంధువులకు చెబుతూ వచ్చింది. రెండేళ్లు గడిచినా జిగ్నేశ్ జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో జిగ్నేశ్ బంధువు ఒకరు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అతని వివరాలు ఆరా తీయగా, పృథ్వీ చెప్పేందుకు నిరాకరించింది. దీంతో జిగ్నేశ్ సోదరుడు అశోక్ స్వయంగా విచారణ ప్రారంభించగా.. ఆస్ట్రేలియాలో జిగ్నేశ్ పేరుతో ఎలాంటి రికార్డులు లేవని తేలింది. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, భార్య పృథ్వీ అసలు నిజం బయటపెట్టింది. తన ప్రియుడు నిలేష్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.

Gujarat Murder Case | హత్యకు దారితీసిన పరిస్థితులు..

ప్రియుడు నిలేష్‌తో పృథ్వీకి పెళ్లికి ముందే ప్రేమసంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా వీరు తమ బంధాన్ని కొనసాగించారు. ఈ వివాహేతర సంబంధానికి భర్త జిగ్నేశ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పృథ్వీ.. ప్రియుడితో కలిసి అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. పథకంలో భాగంగా జిగ్నేశ్‌కు మద్యం తాగించి, అందులో సైనైడ్ కలిపి హత్య చేశారు. అనంతరం జామ్‌నగర్‌లోని జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి మృతదేహాన్ని తరలించి, ముక్కలుగా నరికి సుమారు 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త ఆస్ట్రేలియాలో ఉన్నట్లు నమ్మిస్తూ కాలం వెళ్లదీశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.


ఇది కూడా చదవండి:  Abhijeet Dipke BJP | బీజేపీలోకి రావాలని బెదిరింపులు.. సీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *