Peddi Sudarshan Reddy | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..రాజకీయ వర్గాల్లో విషాదం

శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్‌లో కీలక నేతగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Peddi Sudarshan Reddy | నర్సంపేట Narsampet మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద Yashoda ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Peddi Sudarshan Reddy | ఆదివారం నుంచి వెంటిలేటర్‌పైనే

గత కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆయన కన్నుమూశారు.

Last Mile Connectivity | లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ : కల్వకుంట్ల కవిత విమర్శ

పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా నిలిచారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్‌లో కీలక నేతగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

Peddi Sudarshan Reddy | తరలి వస్తున్న కార్యకర్తలు

ఆయన మరణవార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.

ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం స్వగ్రామం లేదా నివాసానికి తరలించే అవకాశమున్నట్లు సమాచారం. అంత్యక్రియల వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో నర్సంపేట ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *