Indian Stock Market | మూడో రోజూ లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 3వ రోజూ లాభాలతో కొనసాగింది. సెన్సెక్స్ 166 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్లు పెరిగాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  Indian Stock Market | విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండడం, కంపెనీలు మొదటి త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరచడం, ముడిచమురు ధరలు దిగివస్తుండడంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా స్పందించారు.

గ్లోబల్ మార్కెట్లు (Global Markets) సైతం పరుగులు తీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 3వ సెషన్‌లోనూ లాభాల బాటలో సాగింది. ఐటీ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం క్యూ1 ఫలితాలు సూచీలకు ఊతమిచ్చాయి.

Indian Stock Market | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 189 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో అక్కడినుంచి 463 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ప్రారంభమై 62 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి క్రమంగా పుంజుకుని 130 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 78,094 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 24,383 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,568 కంపెనీలు లాభపడగా 1,653 స్టాక్స్ నష్టపోయాయి. 204 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 128 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 82 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్ లాభపడగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 8.11 శాతం, బజాజ్ పిన్‌సర్వ్ 6.60 శాతం, ఎం అండ్ ఎం 3.58 శాతం, అదానీపోర్ట్స్ 2.12 శాతం, టాటా స్టీల్ 1.52 శాతం లాభపడ్డాయి.

Top Losers : టీసీఎస్ 2.73 శాతం, ఎటర్నల్ 2.72 శాతం, ఇన్ఫోసిస్ 2.26 శాతం, ఐటీసీ 1.51 శాతం, ఇండిగో 1.17 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | లాభాల్లో దేశీయ మార్కెట్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *