అక్షరటుడే, వెబ్డెస్క్: Omar Abdullah Divorce | జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టు (Supreme Court) విడాకులు మంజూరు చేసింది. ఇరువురు పరస్పర అంగీకారంతో తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకోవాలని కోరడంతో పాటు, పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి అంగీకరించడంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2011లో తమ 17 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. అప్పటి నుంచి వారు విడిగా ఉంటున్నారు.
Omar Abdullah Divorce | న్యాయ పోరాటం..
విడాకుల కోసం 2016లో ఒమర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ఆ పిటిషన్ రద్దయింది. ఆ తర్వాత 2023లో దిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా దిగువ కోర్టు తీర్పునే సమర్థించారు. దిగువ కోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ గతేడాది వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల మొదట్లో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో, విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
*Supreme Court to dissolve Omar Abdullah’s marriage in terms of settlement reached through mediation*#SupremeCourt #OmarAbdullah #PayalAbdullah #DivorceCasehttps://t.co/rjRRKROr6b pic.twitter.com/YrZHnaOqxo
— Munsif Web Desk (@MunsifWebDesk) July 31, 2026
ఇది కూడా చదవండి..: Shehzad Poonawalla | ఎక్స్ బయో మార్చిన షెహజాద్ పూనావాలా.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారా?