Navipet Railway Gate | నవీపేట్​ రైల్వేగేట్​ వద్ద గుంతల పూడ్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Navipet Railway Gate | నవీపేట్​ (Navipet) రైల్వేగేట్​ వద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నవీపేట్​ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ‘అక్షరటుడే’లో ‘అలసత్వపు గుంతల్లో.. నలిగిపోతున్న నవీపేట్ ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించగా రైల్వేశాఖ స్పందించింది.

Navipet Railway Gate | తారుతో గుంతల పూడ్చివేత..

నవీపేట్​ పాలకవర్గం విన్నపాలు.. ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో రైల్వే శాఖ అధికారులు స్పందించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొనడంతో రైల్వే సిబ్బంది తక్షణమే ఆ గుంతలను తారుతో పూడ్చివేశారు. ఈ సందర్భంగా నవీపేట్​ సర్పంచ్​, ఉపసర్పంచ్​ పాలక వర్గం సభ్యులు మాట్లాడుతూ.. చాలారోజులుగా గుంతలవల్ల అవస్థలు పడ్డామని.. ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారన్నారు. అధికారులు గుంతలు పూడ్చివేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి..: Congress Leader Death | గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *