Nasha Mukt Yuva Abhiyan | యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలి : ప్రధాని మోదీ

యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nasha Mukt Yuva Abhiyan | యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు.

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక యువకుడు డ్రగ్స్​కు బానిస అయితే అతడు ఒకడే నష్టపోడన్నారు. ఒక కల కూడా కరిగిపోతుందని పేర్కొన్నారు. మన యువతను వ్యసనం అనే ఊబిలోకి లాగడానికి శత్రు దేశాలు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా ద్వారా లాభం పొందుతూనే, మన దేశాన్ని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వారి ఉగ్రవాద ప్రేరేపిత ఎజెండాలో ఒక భాగం అన్నారు.

Nasha Mukt Yuva Abhiyan | ఆరోగ్యంగా ఉండాలి

యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. డ్రగ్స్​ వంటి వ్యసనాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలతో కలిగే ప్రమాదాలను అర్థం చేసుకుని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని గత సంవత్సరం ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తాజాగా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100 వారాల పాటు ప్రతి ఆదివారం డ్రగ్స్​తో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతారు.

దీనిని కూడా చదవండి : Sriram Sagar Flood | శ్రీరామ్​ సాగర్​కు కొనసాగుతున్న వరద

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *