Sub-Collectors Transfer | సబ్​ కలెక్టర్​ల బదిలీ..

Naresh Chandan
Sub-Collectors Transfer | సబ్​ కలెక్టర్​ల బదిలీ..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sub-Collectors Transfer | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. బోధన్ సబ్ కలెక్టర్‌ Vikas Mahatoను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను Greater Hyderabad Municipal Corporation (GHMC)లోని ఎల్​బీ నగర్​ జోనల్ కమిషనర్‌గా నియమించారు.

Untitled 2.jpg vikas mahato

2022 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మహాతో సుమారు ఏడాదిన్నర పాటు బోధన్ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. తన పదవీకాలంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.

Untitled 1.jpg kiranmai

Sub-Collectors Transfer | అదనపు కలెక్టర్‌గా

బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న Kiranmayiని రంగారెడ్డి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పరిపాలనా సమర్థతను పెంపొందించేందుకు, సేవల పంపిణీని మరింత మెరుగుపరచేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త బాధ్యతల్లో ఈ అధికారులు తమ అనుభవంతో సమర్థవంతంగా పని చేస్తారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Telangana IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకేసారి భారీ స్థాయిలో ఐఏఎస్​ల బదిలీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *